గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో ముగియబోతున్నాయి. వాటి ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకాబోతున్నారు. ఇవ్వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు అయన బేగంపేట విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రాజ్ భవన్ చేరుకొని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5 గంటలకు ఎల్.బి.స్టేడియం చేరుకొని ముగింపు వేడుకలలో పాల్గొంటారు. అనంతరం మళ్ళీ రాజ్ భవన్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు హుస్సేన్ సాగర్ వద్ద గల బుద్ధ విగ్రహం దర్శించుకొన్న తరువాత అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకొని డిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
రాష్ట్రపతి పర్యటనకు వస్తునందున ఆయన పయనించే మార్గాలలో బారీగా పోలీసులను మొహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాలలో నేడు, రేపు ట్రాఫిక్ ను వేరే మార్గాలలోకి మళ్ళిస్తారు.