రెండు రాష్ట్రాలలో కమల వికాసమే

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా భాజపా ఆధిక్యతలో కొనసాగుతోంది. గుజరాత్ లో 192 స్థానాలలో  భాజపా 50 స్థానాలలో ఆధిక్యత సాధించి, మరో 51 స్థానాలలో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలలో ఆధిక్యత సాధించి, 35 స్థానాలలో విజయం సాధించింది. ఇతరులు రెండు స్థానాలలో విజయం సాధించారు. 

ప్రభుత్వం ఏర్పాటుకు 92 స్థానాలు అవసరం. కనుక గుజరాత్ లో మళ్ళీ భాజపా ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైనట్లే భావించవచ్చు. 

ఇక హిమాచల్ ప్రదేశ్ లో  మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరుగగా వాటిలో భాజపా 33 స్థానాలలో ఆధిక్యత సాధించి 9 స్థానాలలో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలలో ఆధిక్యత సాధించి 5 స్థానాలలో విజయం సాధించింది. మరో మూడు 3 స్థానాలలో ఇతరులు ఆధిక్యతలో ఉండగా రెండు సీట్లను గెలుచుకొన్నారు. 

గుజరాత్ లో భాజపా గెలిచే అవకాశాలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి చాలా గట్టి పోటీనిస్తూ ముచ్చెమటలు పట్టింస్తోంది.  ఇక హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 35 సీట్లు అవసరం కాగా భాజపా మంచి ఆధిక్యతలో కొనసాగుతోంది కనుక భాజపా చేతిలో కాంగ్రెస్ ఘోరపరాజయం కావడం తధ్యమని చెప్పవచ్చు.