సంబంధిత వార్తలు
30.jpg)
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో రోజు మాజీ సిఎం కేసీఆర్‌కి నోటీస్ వస్తుందని అందరూ అనుకుంటున్నదే. అదే నిజమవుతోంది. సిట్ అధికారులు ఆయనకు నోటీస్ ఇచ్చేందుకు ఈరోజు ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌసుకు బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆయన హోదా, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సిట్ అధికారులు ఆయనని ఫామ్‌హౌసులోనే ప్రశ్నించబోతున్నట్లు తాజా సమాచారం. కానీ ఈ విషయం సిట్ అధికారులు లేదా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. బహుశః మరికొద్ది సేపటిలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.