విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతి?

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 8.45 గంటలకు పూణే జిల్లాలోని బారామతి వద్ద విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో హటాత్తుగా కుప్పకూలిపోయింది. క్షణాలలో మంటలు వ్యాపించి విమానం దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పైలట్లతో సహా మొత్తం ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక, సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. కానీ విమానంలో ప్రయాణిస్తున్నవారందరూ అప్పటికే చనిపోయినట్లు సమాచారం. అజిత్ పవార్ మృతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ద్రువీకరించాల్సి ఉంది.

అజిత్ పవార్ మంగళవారం రాత్రి ముంబయిలో సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు బారామతిలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఉదయం ముంబాయి నుంచి బయలుదేరారు.