
హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్‌కి అనూహ్యంగా రోజుకో కొత్త సవాలు ఎదుర్కోవలసి వస్తోంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే వాటిని నిరూపించాలని లేకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిస్తూ లెటర్ పంపించారు.
ఈలోగా తీన్మార్ మల్లన్న ఆయనపై తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేశారు. ఆ స్థాయిలో ఉన్న మీపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంత దారుణంగా కామెంట్స్ చేస్తే కనీసం స్పందించలేకపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ శాఖలో ఎవరూ ఆయనకు అండగా నిలబడకపోవడాన్ని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు.
ఎవరైనా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలపై పోస్టులు పెడితే వెంటనే స్పందించే పోలీస్ శాఖ, తమ కమీషనర్, సీనియర్ అధికారి విసి సజ్జనార్‌పై ఇంత దారుణంగా విమర్శిస్తే పట్టించుకోలేదని తీన్మార్ మల్లన్న ఆక్షేపించారు.