
2026-27 సం.లకు గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సన్నాహాలు ప్రారంభించారు. శనివారం నుంచి శాఖల వారీగా మంత్రులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు.
ఆయా శాఖలలో జరుగుతున్న పనులు, ఆదాయ, వ్యయాలు తదితర అంశాల గురించి లోతుగా చర్చిస్తారు. ప్రతీరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ మేరకు ఆర్ధిక శాఖా ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్ని శాఖలకు సమాచారం అందించారు.
హోం శాఖ, న్యాయశాఖ, లా అండ్ ఆర్డర్ మరికొన్ని శాఖలు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి కనుక వాటి సమీక్షా సమావేశాలకు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఆ తర్వాత శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు చేసి బడ్జెట్ రూపొందించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన తర్వాత ఫిభ్రవరి-మార్చి నెలల్లో శాసనసభ మావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెడతారు.