సంబంధిత వార్తలు
రాష్ట్రంలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమీషన్ల ఏర్పాటుచేయడానికి సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం సంతకం చేశారు. దీనికి చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను నియమించారు. ఈ కమీషన్ లో సభ్యులుగా సుంకపాక దేవయ్య (హైదరాబాద్), ఎం.రాంబాల్ నాయక్ (రంగారెడ్డి), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి), బోయిళ్ళ విద్యాసాగర్ (సూర్యాపేట)లను నియమించబడ్డారు.