హైదరాబాద్ నగరంలో నేటి అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాలలో నూతన సంవత్సర వేడుకలు జరుగబోతున్నాయి. కనుక వాటిలో పాల్గొని ఇళ్ళకు తిరిగి వెళ్ళే వారి సౌకర్యార్ధం ఈరోజు రాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్ళు తిప్పుతామని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు తెలియజేశారు. కనుక హైదరాబాద్ నగరవాసులు అందరూ మెట్రో రైల్ సర్వీసులను ఉపయోగించుకోవలసిందిగా అధికారులు కోరారు. మళ్ళీ ఉదయం యధాప్రకారం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయి.
గమనిక: ఈరోజు (డిసెంబర్ 31) రాత్రి వరకు రూ.200 ఖరీదు గల మెట్రో స్మార్ట్ కార్డులు రూ.150 కే అన్ని మెట్రో స్టేషన్ల వద్ద లభిస్తాయి. వీటి కాలపరిమితి ఏడాది ఉంటుంది కనుక నగరవాసులు వీటిని నేడే కొనుగోలు చేసుకోవడం మంచిది.