ఖమ్మంలో మిషన్ భగీరధ ట్రయల్ రన్ షురూ

ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరధ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. శుక్రవారం సాయంత్రం పాలేరు నుంచి నీటిని విడుదల చేయగా అవి నేడు జీళ్ళచెర్వులో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంట్ (వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్) కు చేరుకొన్నాయి. అక్కడ శుద్ధి చేసిన నీళ్ళు జిల్లాలో 594 గ్రామాలలో ప్రతీ ఇంటికి అందబోతున్నాయి. జీళ్ళచెర్వు ట్రీట్ మెంట్ ప్లాంట్ లో రోజుకు తొమ్మిది కోట్ల లీటర్ల నీటిని శుద్ధిచేసే విధంగా నిర్మించారు. ఇవ్వాళ్ళ జీళ్ళచెర్వు ప్లాంట్ కు నీళ్ళు చేరుకొన్నాయి కనుక ట్రయల్ రన్ లో భాగంగా త్వరలోనే గ్రామాలకు విడుదల చేసే అవకాశం ఉంది.