పవన్ కళ్యాణ్ అభిమానులే టార్గెట్ గా నాని కొత్త సినిమా

జెంటిల్ మ్యాన్ సినిమా ఈ శుక్రవారం విడుదలవనుండడంతో, ఇక ఈ సినిమా పై దృష్టి మల్లించి తన తదుపరి సినిమా గురించి అప్పుడే నాని ఆలోచించడం మొదలుపెట్టేశాడు. గతంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో బాలకృష్ణ కి అభిమానిగా నటించి, నందమూరి అభిమానుల సపోర్ట్ తో ఆ సినిమాకి కలెక్షన్లు బాగానే రప్పించుకున్నాడు. 

ఇక ఈసారి నాని కన్ను పవన్ కళ్యాణ్ అభిమానుల పై పడింది. ఉయ్యాల జంపాల సినిమా డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వంలో నాని కొత్త సినిమా ఉంటుంది. కథ బాగా నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 

గతంలో గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన చాలా సార్లు తీసుకురావడంతో, ఆ సినిమాని పవర్ స్టార్ అభిమానులు నెత్తిన పెట్టుకున్నారు. మరి ఇదే లాజిక్, నాని సినిమాకి కూడా పని చేస్తుందా లేదా అనేది చూడాలి.