
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డికి మద్య పెమెంట్స్ విషయంలో చిన్నగా మొదలైన గొడవ కోర్టుకు చేరుకునేలా ఉంది.
ప్రశాంత్ వర్మ పిర్యాదుతో ఈ పంచాయితీ ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్లో ఉంది. కానీ నిరంజన్ రెడ్డి మీడియా ముందుకు రావడంతో బయటకు పొక్కింది. ఆయనేమన్నారంటే, హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ మాతో అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మ రాక్షస సినిమాలు చేస్తామన్నారు. అందు కోసం ఆయనకు రూ.10.23 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చాము.
కానీ అయన మాతో ఆ సినిమాలు చేయకపోగా మరో రూ.10.23 కోట్లు మాతో ఖర్చు చేయించి వేరే నిర్మాత నుంచి ‘ఆక్టోపస్’ హక్కులు కొనిపించారు. కానీ దానికి ఎన్ఓసీ కూడా ఇప్పించలేదు. ఇప్పుడు మా సినిమాలు చేయకుండా వేరే వారితో వేరే సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన వలన మాకు కలిగిన ఈ నష్టానికి రూ. 200 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.
ప్రశాంత్ వర్మ ఫిల్మ్ ఛాంబర్‌కు చెప్పింది మరోలా ఉంది. “నిరంజన్ రెడ్డి చెపుతున్నట్లు ఆ సినిమాలు చేస్తానని నేను ఆయనతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. ఆక్టోపస్ విషయంలో ఏమైనా వివాదం ఉంటే ఆ సినిమా నిర్మాతతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. కానీ నన్ను నిందిస్తున్నారు.
హనుమాన్ సినిమాకు గాను అయన రూ.15.82 కోట్లు ఇచ్చారు. కానీ ఒప్పందం ప్రకారం సినిమా లాభాలలో నాకు వాటా ఇవ్వాలని అడిగాను. కానీ ఇవ్వలేదు. ఇవ్వకుండా తప్పించుకోనేందుకే ఆయన ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఎందుకంటే హనుమాన్ సినిమాలో వచ్చిన లాభాలను డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్ల రంగ సినిమాలకు మళ్ళించారు. ఇదే విషయం నేను ఫిల్మ్ ఛాంబర్‌కు పిర్యాదు చేశాను,” అని ప్రశాంత్ వర్మ చెప్పారు.
ఇది కోట్ల రూపాయలకు సంబందించిన వ్యవహారం కనుక ఫిల్మ్ ఛాంబర్ దీనిని పరిష్కారించలేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు కోర్టుని ఆశ్రయించడం ఖాయమే.