
శ్రీరామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, అనంది సుమ జంటగా చేస్తున్న ‘ప్రేమంటే’ సినిమా టీజర్ ఆదివారం విడుదలయ్యింది. యువ నటులలో ప్రియదర్శి కాస్త జాగ్రత్తగా కధలు ఎంపిక చేసుకొని హిట్ కొడుతుంటారు. కనుక ప్రేమంటే అలాగే ఉంటుందనిపిస్తుంది టీజర్ దానిలో కామెడీ చూస్తే.
ఈ సినిమాలో యాంకర్ సుమ తొలిసారిగా పోలీస్ యూనిఫారం వేసుకోగా వెన్నెల కిషోర్ ఆమె బాస్‌గా నటించారు. కనుక వారిద్దరి కామెడీ ఈ సినిమాకు పెద్ద బోనస్ కావచ్చు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: రవిచంద్ర తిరున్, ఆర్ట్: అరవింద్ ములే చేస్తున్నారు.
స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కుర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది.