బైకర్ శర్వా ఫస్ట్ గ్లిమ్స్‌

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వానంద్ తన 37వ సినిమా ‘బైకర్’ మొదలుపెట్టేశారు. ఈ సినిమాలో శర్వా బైక్‌ రేసర్‌గా నటిస్తున్నారు. శనివారం బైకర్ ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో బైక్‌ రేసర్స్ ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ళు చూపిస్తూ శర్వా హీరోగా కధ అల్లుకున్నారు దర్శకుడు.    

ఈ సినిమాలో శర్వాకు జోడీగా మాళవిక నాయర్ నటిస్తుండగా డాక్టర్ రాజశేఖర్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర,  సంగీతం: గిబ్రన్ వైబోధ, కెమెరా:జె.యువరాజ్, ఎడిటింగ్: అనిల్ పాసల, ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, కోరియోగ్రఫీ: రాజు సుందరం, శేఖర్ విజే, విశ్వ రఘు చేశారు.   

ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించబోతున్నారు. డిసెంబర్‌ 6న బైకర్ విడుదల కాబోతోంది.