భోగి: అనుపమ పరమేశ్వరన్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌

బైకర్ తర్వాత శర్వానంద్‌ చేస్తున్న సినిమా భోగి. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చేస్తున్నారు. భోగీలో ఆమె పాత్రని పరిచయం చేస్తూ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో గిరిజన మహిళగా నటిస్తోంది. ఆమె పాత్ర పేరు కందుల సులోచనా రాణి అని తెలియజేశారు.  

1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాల నేపధ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కాబోతోంది.