బ్రహ్మోత్సవం దెబ్బ కళ్యాణ్ రామ్ సినిమాపై పడింది!

బ్రహ్మోత్సవం దెబ్బకి భారీగా కుమిలిపోయిన మహేష్ బాబు, మరో సారి ఫ్లాప్ ని తీస్కునే ప్రశ్నే లేదని నిశ్చయించుకున్నాడు. పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి భారీ హిట్లిచ్చిన పూరి జగన్నాథ్ ని కూడా నమ్మే స్థాయిలో మహేష్ లేదు. పూరి దర్శకత్వంలో జనగణ అనే సినిమా చేయాల్సి ఉన్న మహేష్, ఒక కండీషన్ పెట్టాడట. టెంపర్ తర్వాత ఈ మధ్యకాలంలో సక్సెస్ లేని ఈ డైరెక్టర్ చేతిలో మళ్ళీ పాడడం రిస్క్ అనుకున్నాడో ఏమో మహేష్ పక్కాగా ఉండాలనుకుంటున్నాడు.  

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో తను (పూరి) చేస్తున్న సినిమా జయాపజయాలను బట్టి పూరీ తో సినిమా చేయాలా వద్దా అనేది నిశ్చయించుకుంటానని చెప్పినట్లు సమాచారం. ఈ మాటకి షాక్ కి గురైన పూరి, కళ్యాణ్ రామ్ సినిమాని అత్యంత జాగ్రతగా చేస్తున్నాడు. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరిణీతి చోప్రా ఈ సినిమాలో నటించడానికి మూడు కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.