బన్నీ సుల్తాన్.. స్నేహ సుల్తానా

సరైనోడు సినిమాతో తెలుగు, మలయాళం భాషలలో భారీ హిట్టు కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన సరైనోడు సినిమా తెలుగులోనే కాకుండా మలయాళంలో యోధవు పేరుతో విడుదలై ఘనవిజయం సాధించింది. 

ఈ సినిమా తర్వాత బన్నీ తన కొత్త సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి కుటుంబంతో కలిసి టర్కీ టూర్ కి వెళ్ళడం తెలిసిందే. అక్కడ బన్నీ తన భార్య స్నేహతో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సుల్తాన్, సుల్తానా గెటప్ లలో బన్నీ-స్నేహాల లుక్ మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.  

ఇక ఈ హాలీడే ట్రిప్ పూర్తిచేసుకున్న తర్వాత బన్నీ తన తర్వాతి చిత్రం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో, అలాగే ‘ఇష్క్’, ‘24’ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ రెండింటిలో ఎవరి సినిమా ముందు చేస్తాడో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.