గాయాలయ్యాయని ఒప్పుకున్న రకుల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ. గోపిచంద్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి వరుస హిట్స్ తో టాలీవుడ్ టాప్ 5 హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది రకుల్. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ భామ గాయాలపాలయ్యింది.

ఓ కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన ఈ అమ్మడు.. ప్రొగ్రామ్ ముగించుకొని ఇండియాకు వస్తున్న సమయంలో గాయపడినట్లుగా తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మీడియా వారు రకుల్ కాలు మరియు భుజాలకు గాయాలయ్యాయి అంటూ వార్తలు రాసేసారు. చివరకు ఈ విషయంపై రకుల్ ఓ క్లారిటీ ఇచ్చేసింది.

తనకు గాయాలైన మాట నిజమే కానీ.. కాలు మరియు భుజానికి కాదు. మెడ భాగంలో మాత్రమే గాయమయ్యిందని.. కానీ ఇపుడు ఆ గాయం తగ్గి, మళ్లీ షూటింగ్ పాల్గొనబోతున్నానని రకుల్ చెప్పుకొచ్చింది. రకుల్ క్లారిటీతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.