
ఒక పెద్ద హీరో సినిమాకి మొదటి రోజు నాలుగు షోలు వేస్తేనే కలెక్షన్లు కుమ్మేస్తుంటే, మరి ఐదు షోలు వేస్తే పరిస్థితి ఎలా ఉంటది? ఈ ప్రశ్నకి సమాధానం మే 20న తెలుస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద సింగల్ స్క్రీన్ థియేటర్ లలో మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకి ఉదయం 8. 10 నిమిషాలకు ఒక స్పెషల్ షో వేయడానికి అనుమతినిచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రిలీజ్ లోపు అనుమతి ఇస్తుందని సమాచారం. ఈ అదనపు షో మొదటి రోజు మాత్రమే వేసుకోవడానికి అనుమతి ఉంటుంది. రెండవ రోజు నుండి యధాతధిగా నాలుగు షో లు మాత్రమే వేసుకోవాలి.
బెనిఫిట్ షో ల లెక్కలు అఫీషియాల్ ఎకౌంటు లోకి రావు కాబట్టి, ఈ అదనపు షో కలెక్షన్స్ సినిమాకి ప్లస్ అవుతాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఒక పెద్ద హీరో సినిమాకి కలెక్షన్ల వరద కురవడం కొత్తేం కాదు.
ఉదాహరణకి మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సర్దార్ గబ్బర్ సింగ్, ముప్పై కోట్లు ఒక్కరోజులోనే రాబట్టడం విశేషం. అదే ఈ ఐదో షో కూడా ఉండుంటే, కలెక్షన్లు మరింత పెరిగేవే.
ఇప్పటి వరకు మొదటి రోజు అధిక షేరు బాహుబలి పేరిట ఉండగా, 28.34 కోట్లతో సర్దార్ గబ్బర్ సింగ్ రెండో స్థానంలో ఉంది. మరి బ్రహ్మోత్సవం తో మహేష్ ఈ లెక్కలు ఎలా తారు మారు చేస్తాడో వేచి చూడాల్సిందే.