అక్టోబర్‌ 23న థియేటర్లలో మళ్ళీ వర్షం!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయారు. కనుక ఇదివరకులా క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను అలరించే మామూలు సినిమాలు రావడం లేదు. అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్‌  అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ఛానల్‌! 

ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘వర్షం’ మరోసారి థియేటర్లలోకి రానుంది. 2004లో విడుదలైన ‘వర్షం’ అప్పట్లో ఘన విజయం సాధించింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వర్షం’లో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించారు. ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాతో ప్రభాస్, త్రిష జోడీ చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు నేటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. 

ఈ నేపథ్యంలో  ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి అభిమానుల కోసం థియేటర్లలో ‘వర్షం’ కురువబోతోంది.