
పురుషోత్తముడు వంటి ఫ్లాప్ తర్వాత రాజ్ తరుణ్ కొంచెం గ్యాప్ తీసుకొని ‘తాబేలు’తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంటే సినిమా పేరు ‘టార్టాయిస్’ అన్నమాట. ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదలైంది. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అలా నడుస్తున్నప్పుడు తెలియకుండానే హత్యలు చేస్తుంటాడని ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కి జంటగా అమృత చౌదరి నటిస్తుండగా, సప్తగిరి ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రిత్విక్ కుమార్, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్, పెంచల దాస్, వంశీ కమల్, కెమెరా: శబరీ విక్నేష్, ఆర్ట్: దేవర మధుకర్, ఎడిటింగ్: గుళ్ళపల్లి మాధవ్ కుమార్ చేస్తున్నారు.
ఈ సినిమాని ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరీ, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు కలిసి నిర్మిస్తున్నారు.