
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో తెలంగాణలో చాలా పాపులర్ జానపద గీతం ‘యేషనాగుల కట్టమీద’ నేడు విడుదలైంది.
కాసర్ల శ్యామ్ వ్రాసిన ఈ పాటకు అనిరుద్ సంగీతం అందించగా జంగి రెడ్డి, ప్రభ కలిసి పాడారు. ఇదే ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన స్పెషల్ సాంగ్. ఈ పాటకు నాని, కీర్తి సురేష్ హుషారుగా డాన్స్ చేశారు.
ప్యారడైజ్‌లో తనికెళ్ల భరణి, మోహన్ బాబు, ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, కృష్ణ తేజ, తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: తోట శ్రీనివాస్, కెమెరా: సిహెచ్ సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు.
దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. చాలా భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నారు.