అక్టోబర్‌లో తెల్ల కాగితంతో హర్ష్ రోషన్‌

రమేష్ బండ్రేడ్డి దర్శకత్వంలో హర్ష రోహాన్, నక్షత్ర జంటగా చేస్తున్న ‘తెల్ల కాగితం’ రిలీజ్‌ డేట్ వచ్చింది. అక్టోబర్‌ 2న తెల్ల కాగితం విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ చక్కటి పోస్టర్ విడుదల చేశారు.  

హైస్కూల్ విద్యార్ధుల ప్రేమలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. కనుక తెల్ల కాగితంతో యువత బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో దీపక్, అజయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నందు సవిరిగన, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: కేవీ గుహన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: ఆర్‌. కార్తీక శ్రీనివాస్ చేశారు.

  కే. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది.