
కార్తీక్ గరిమెళ్ల దర్శకత్వం దేవాన్ష్, తేజ కొండపల్లి, గణేశ్ బొడ్డా, వర్షిక పాశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా పేరు ‘ముగ్గురు కోతులు.’ ఈ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. ఈ సినిమా టైటిల్.. టైటిల్ సాంగ్‌లోనే సినిమా కథ చెప్పేశారు. ఓ ఊళ్ళో పనిపాటు లేకుండా తిరిగే ముగ్గురు స్నేహితుల కథ ఇది. జాతిరత్నాలు సినిమా స్పూర్తితో ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కానీ కొత్త జాతిరత్నాలు లభించడం లేదు.
జీఎస్ఆర్ క్రియేషన్స్, స్కై ఫ్లేర్స్ నెట్‌వర్క్స్ బ్యానర్లపై శోభారాణి గరిమెళ్ల ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఎస్.సుహాస్, కెమెరా: రాజ్ నోముల, ఎడిటింగ్: జమీర్ షేక్ చేస్తున్నారు.