
అక్కినేని నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’ ఫస్ట్ గ్లిమ్స్ నేడు విడుదలైంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ, ‘డబ్బు ఇచ్చే గుర్తింపు... దానిని నిలబెట్టుకునేందుకు సాగే పరుగు’ అని నాగార్జున వాయిస్ ఓవర్‌తో చెప్పించేశారు. ఫస్ట్ గ్లిమ్స్‌లో నాగార్జున మాస్, స్టయిలిష్ లుక్స్ బాగున్నాయి.
ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా సుష్మిత భట్ చేస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటి టబు, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కథ, దర్శకత్వం: రా. కార్తీక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రాజా మహాదేవన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
అన్నపూర్ణా స్టూడియోస్ అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించి నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 26న విడుదల కాబోతోంది.