మహేంద్రగిరి వారాహి ట్రైలర్‌.. చూశారా?

అక్కినేని సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు చేసిన ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్‌ నిన్న విడుదలైంది. ట్రైలర్‌లో మహేంద్రగిరి రాజవంశస్థులకు వారాహి అమ్మవారు ఇచ్చిన శాపం వలన వరుస చావులు, ఆ శాప కారణం తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలని అర్ధమవుతోంది. గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. 

ఈ సినిమాలో సుమంత్, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, మాళవికా నాయర్, మంజు భార్గవి, రాజీవ్ కనకాల, వంశీ చాగంటి, కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని త తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రతాప్ ఆర్‌ కృష్ణ, ఎడిటింగ్: జునైడ్ సిద్దిక్‌ చేశారు.

రాజశ్యామల ఎంటర్‌టైన్మెంట్స్‌, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై మధుకాలిపు, లక్ష్మణ్ కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 11న విడుదల కాబోతోంది.