ప్యారడైజ్‌లో ఆ తెలంగాణ ఫోక్ సాంగ్‌

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ప్యారడైజ్‌లో ఆ తెలంగాణ ఫోక్ సాంగ్‌ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ, “అవును నిజమే! ‘యేషనాగుల కట్టమీద’ పాపులర్ డీజే ఫోక్ సాంగ్‌ ఈ సినిమాలో ఉంది. కాసర్ల శ్యామ్‌ వ్రాసిన ఈ పాటని జంగి రెడ్డి, ప్రభ కలిసి పాడారు,” అని సోషల్ మీడియా ద్వారా ధృవీకరించాఋ. ఈ పాటకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ నెల 29న ఈ పాట విడుదల చేయబోతున్నామని శ్రీకాంత్ ఓదెల తెలియజేశారు.      

ప్యారడైజ్‌లో మోహన్ బాబు‘శికంజ మాలిక్’ విలన్‌గా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు ‘బిర్యాని’ అనే వెరైటీ పాత్ర చేస్తున్నారు.  

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: తోట శ్రీనివాస్‌, కెమెరా: సిహెచ్ సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు. 

దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై దర్శక నిర్మాతలకు చాలా భారీ అంచనాలున్నాయి. కనుక తొలిసారిగా బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్‌ 24న విడుదల కాబోతోంది.