
నిషాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ జంటగా నటించిన ‘‘సహా... లైఫ్ ఆఫ్ సంజు’ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఇద్దరి బాల్య స్నేహితుల మధ్య ఏర్పడిన ప్రేమగా మారడం, ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలు, కాలంతో పాటు పరిస్థితులు మారినప్పుడు వెంటాడే గత జ్ఞాపకాలే ‘సహా... లైఫ్ ఆఫ్ సంజు’ కథాంశం.
ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన దర్శక నిర్మాతలు సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పగా, హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ, “ఈ సినిమా చూసి మెచ్చుకుంటారు లేకుంటే నేను అమీర్ పేట చౌరస్తాలో గుండు గీయించుకుంటాను,” అని అన్నారు. ఆమె మాటలు ఈ సినిమాపై వారి నమ్మకం తెలియజేస్తోంది.
సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: కరుణాకర్, ఎడిటింగ్: దినేష్ పెద్ది చేస్తున్నారు. ‘సహా... లైఫ్ ఆఫ్ సంజు’ ఎలా ఉంటుందో సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదలైనప్పుడు తెలుస్తుంది.