
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలిసారి హీరోగా నటించిన సినిమా ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకొని సూపర్ హిట్ అయ్యింది.
సినిమా విడుదలై మూడు వారాలు పూర్తయినందున ఇక ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి డీసీ ప్రసారం కాబోతోంది.
తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ ఓటీటీ ప్రేక్షకులకు డీసీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది.
ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి జంటగా చేశారు. సంజనా కృష్ణమూర్తి, క్రిష్ దయాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
హీరోగా ఇది లోకేష్ కనగారాజ్‌కు తొలి సినిమా అయినప్పటికీ ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి 2026లో హిట్ సినిమాల జాబితాలో చేరింది.