సంబంధిత వార్తలు

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ తాజాగా అనంతిక సనిల్ కుమార్‌ని హీరోయిన్గాఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల ఆమెకు టెస్ట్ షూట్ చేయగా ఓకే అయినట్లు తెలుస్తోంది. కనుక ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్‌కు హీరోయిన్గా ఆమె పేరు ఖరారు అయినట్లే భావించవచ్చు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ సినిమాకు కధ, దర్శకత్వం: వేణు ఎల్దండి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు.