
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’ సినిమా నుంచి లూజర్ అంటూ సాగే ర్యాప్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. సనారే, రీబెల్, నీరజ్ మాధవ్ వ్రాసిన ఈ ర్యాప్ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా,బెన్ని దయాళ్ అద్భుతంగా పాడారు.
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దుల్కర్ సల్మాన్‌కు జంటగా కాయదు లోహర్ నటించగా, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: నహాస్ హిదాయత్, స్క్రీన్‌ప్లే: సజీర్ బాబా, బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబక్కర్, డైలాగ్స్: ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్, కెమెరా: జిమ్షీ ఖాలిద్, ఎడిటింగ్: చమన్ చక్కో చేశారు.
వేఫేర్ ఫిల్మ్స్ సమర్పణలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఐయామ్ గేమ్ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.