లోకేష్ కనగరాజ్ హీరోగా డీసీ... టైటిల్‌ టీజర్‌

ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు లోకేష్ కనగరాజ్, వామిక గబ్బి జంటగా నటిస్తున్న సినిమా పేరు ‘డిసి.’ అరుణ్ మదేశ్వరాన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తీస్తున్నారు. దీనిలో, సంజన కృష్ణమూర్తి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. టైటిల్‌ టీజర్‌ చాలా వెరైటీగా ఉంది. హీరో దేవదాస్ గాయాలతో రక్తం ఓడుతూ సిగరెట్ కాల్చుకుంటూ హోటల్ కారిడార్‌లో వస్తుంటే, హీరోయిన్‌ చంద్ర హోటల్ గదిలో కండోమ్‌ ప్యాకెట్ తీసుకొని ఎదురువెళుతుంది. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అరుణ్ మదేశ్వరాన్,  సంగీతం:అనిరుద్ , కెమెరా: ముకేష్ జి, ఎడిటింగ్:జికే ప్రసన్న, ఆర్ట్: కన్నన్ ఎస్, స్టంట్స్: పీసీ చేస్తున్నారు.