
భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’ ఈ నెల 31న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘హుడియో హుడియో..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ఈరోజు విడుదల చేశారు.
దేవ్ వ్రాసిన ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి మరో ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహేబ్‌తో కలిసి పాడారు. ఈ పాట సాహిత్యం, సంగీతం, ఆలాపన అన్నీ అందరినీ అలరించేలా ఉన్నాయి.
ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మించారు.
రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నా సరైన హిట్ పడి చాలా కాలమే అయ్యింది. కనుక ఈ సినిమాపై అయన, అభిమానులు చాలా ఆశ పెట్టుకున్నారు.
రవితేజ ఎంత మాస్ హీరో అయినప్పటికీ ఎల్లప్పుడూ ఇలా కమర్షియల్ సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులకు చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. ఓ సినిమాలో పోలీస్ ఇన్‌స్పెక్టరుగా మరో సినిమాలో రైల్వే పోలీస్ అధికారిగా ఒకే రకమైన కధతో సినిమాలు చేస్తూ హిట్స్ ఆశిస్తే కష్టమే!
కానీ ఈ సినిమా కధ చాలా భిన్నంగా ఉంటుందని చెపుతున్నారు. కనుక రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది.