.jpg)
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. దర్శకుడు హరీష్ శంకర్ కొంత కాలం క్రితం తన కాలేజీకి వచ్చి నన్ను కలిశాడు. పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో నన్ను విలన్‌గా నటించమని అడిగారు. చేస్తే రూ.3 కోట్లు ఇస్తామన్నాడు కూడా. కానీ ఎంత డబ్బిచ్చినా నేను విలన్ పాత్ర చేయనని ఖారాఖండీగా చెప్పేశా.
ఎందుకంటే ఫస్టాఫ్ అంతా నేను హీరోని తిడతా... అంతవరకు బాగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అంతా నేను ఆయనతో తిట్లు, తన్నులు తినాలి. అందుకే వద్దనుకున్నా,” అని మల్లారెడ్డి చెప్పారు.
మల్లారెడ్డి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఎప్పుడూ హుషారుగానే ఉంటారు. ఎన్నికల ప్రచారంలో అయన చేసే హడావుడి అంతా ఇంతా కాదు. డాన్సులు కూడా చేస్తుంటారు. సినిమాలో విలన్ వేషాలు వేసేందుకు తగిన ఆకారం ఉంది. కనుక దర్శకుడు హరీష్ శంకర్ దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా చేసి ఉండి ఉంటే టాలీవుడ్‌కి కొత్త విలన్ దొరికి ఉండేవారు.
ఫిల్మీ బౌల్ సౌజన్యంతో...