
తెలుగు సినీ నటులలో మంచు లక్ష్మి చాలా డిఫరెంట్. ఆమె నటించిన దక్ష సినిమా ఇందుకు మరో నిదర్శనంగా నిలువబోతోంది. ఇదో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. దీనిలో మంచు లక్ష్మి వరుస హత్యలను దర్యాప్తు చేస్తున్న క్రైం పోలీస్ అధికారిణిగా నటించారు. రెండు వారాల క్రితం విడుదలైన దక్ష ట్రైలర్ అద్భుతంగా ఉంది. కనుక సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉంటే మంచు లక్ష్మి ఖాతాలో సూపర్ హిట్ పడుతుంది.
ఈ సినిమాలో ఆమె తండ్రి మోహన్ బాబు, సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్ల, సిద్ధిఖీ, తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
మోహన్ బాబు సొంత సినీ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి కలిసి నిర్మించారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ కృష్ణ మల్ల, సంగీతం: అచు రాజమణి, కెమెరా: గోకుల్ భారతి, ఎడిటింగ్: మధు రెడ్డి చేశారు. ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కాబోతోంది.