అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా జూలై 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది యానిమేషన్ మూవీ అయినప్పటికీ సూపర్ హిట్ అవడమే కాక సుమారు రెండు వందల కోట్లకు పైగా కలక్షన్స్ కూడా సాధించి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
‘భక్త ప్రహ్లాద సినిమా చూసిన తెలుగు ప్రజలకు ఈ సినిమా, కధ సుపరిచితమే. కానీ అద్భుతమైన యానిమేషన్ చిత్రంగా దీనిని మలిచిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అందుకే ఇంత సూపర్ హిట్ అయ్యింది.
‘మహావతార్ నరసింహ’గా యానిమేషన్ సినిమాకి కధ: జయపూర్ణ దాస్, రుద్ర పి గోష్, అదనపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రుద్ర పి గోష్, సంగీతం: శామ్ సి, ఎడిటింగ్: అజయ్ ప్రశాంత్ వర్మ, అశ్విన్ కుమార్, పాటలు: ది శ్లోక, సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ చేశారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, చైతన్య దేశాయ్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి సహ నిర్మాతలు: ఎస్సీ ధావన్, దుర్గా బాలుజా.