ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అయన నిర్మాతగా ‘దహనం’ అనే వెబ్ సిరీస్ ఆధారంగా అగస్త్య మంజు దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసి 2022, ఏప్రిల్ 14న విడుదల చేశారు.
దానిలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు రాములుని హత్యకు గురవుతహరు. అప్పుడు ఆయన కుమారుడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా చెప్పిన వాస్తవ ఘటనల వివరాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్, సినిమా తీశామనిరాంగోపాల్ వర్మ చెప్పుకున్నారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. తాను ఆయనతో ఎన్నడూ ఈ విషయాల గురించి మాట్లాడలేదని, కానీ అయన తాను చెప్పిన వివరాల ఆధారంగా సినిమా వెబ్ సిరీస్ తీశామని చెప్పడం తనకు ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించారని ఆమె పిర్యాదు చేశారు.
తన అనుమతి లేకుండా సినిమాలో తన పేరుని ఉపయోగించుకోవడం నేరమని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. కనుక తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రాంగోపాల్ వర్మపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అంజనా సిన్హా పోలీసులను కోరారు. ఆమె పిర్యాదు మేరకు వారు రాంగోపాల్ వర్మపై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.