
సుజీత్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చాలా భారీ అంచనాల మద్య ‘ఓజీ’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. అంటే మరో వారంలో సినిమా వచ్చేస్తోందన్న మాట! సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటంతో ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ ఆదివారం ఉదయం 10.08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు సుజీత్ ప్రకటిస్తూ ‘కృష్ణా నిన్ను చేరింది... అష్టాక్షరిగా మారిందీ... అంటూ సాగే ఓ పాట బిట్ జోడించారు. శ్రీకృష్ణుడు వంటి భగవత్ స్వరూపుడి దర్శన భాగ్యమే కష్టమనుకుంటే ఆయనతో (పవన్ కళ్యాణ్) సినిమాయే తీసే భాగ్యం కలిగిందని సుజీత్ తన మనసులో పవన్ కళ్యాణ్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు అందరినీ అలరించేవిదంగా ఈ సినిమా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కాబోతోంది.
"Krishna ninnu cherindhi..
— Sujeeth's OG 🔥 (@Amar_Tweetzz) September 18, 2025
Astakshariga marindhi"...
To early to say but the confidence that I have in you ..
MANAM CHUDALEMU ANUKUNA POWER STAR NI
CHUPINCHABOTUNAV.......🩸🔥🗡️💪
I bow to you @Sujeethsign ....❤️😭#TheyCallHimOG https://t.co/GUOgE8ojZ8 pic.twitter.com/OHO47c4dKV