
సుమంత్ మళ్లీరావా సినిమాతో సత్తా చాటి నాచురల్ స్టార్ నానితో జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమాను తీశాడు టాలెంటెడ్ డైరక్టర్ గౌతం తిన్ననూరి. తెలుగులో జెర్సీ హిట్ అవగానే ఆ సినిమా హిందీ రీమేక్ ఆఫర్ రాగా అక్కడ కూడా గౌతం రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ జెర్సీ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ తర్వాత తెలుగులో చరణ్ తో గౌతం సినిమా ఉంటుందని టాక్ వచ్చింది.
లేటెస్ట్ గా చరణ్ సినిమా కన్నా ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గౌతం తిన్ననూరి సినిమా ఉంటుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఇమేజ్ కు తగినట్టుగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కథ సిద్ధం చేశాడట గౌతం. కథ కూడా విజయ్ కు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సో చరణ్ సినిమా కన్నా ముందు విజయ్ దేవరకొండతో సినిమా తీస్తున్నాడు గౌతం తిన్ననూరి. ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మిగతా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.