బైకర్ ప్రెటీ బేబీ సాంగ్ ప్రమో!

శర్వానంద్ 36వ సినిమా ‘బైకర్’ నుంచి నేడు ప్రెటీ బేబీ అంటూ సాగే పాట ప్రమో విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ బైకర్‌గా చేస్తున్నారు కనుక ఈ పాటకి బైక్‌పై నిలబడి హీరోయిన్‌తో డాన్స్ చేశారు. కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాటని గిబ్రన్ స్వరపరిచి సంగీతం అందించి యాజిన్ నాజర్, సుభాలషినితో కలిసి హుషారుగా పాడారు. పూర్తిపాట రేపు (గురువారం) విడుదల కాబోతోంది.       

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వాకు జోడీగా మాళవిక నాయర్ జంటగా నటిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్; కెమెరా: జె యువరాజ్; ఎడిటింగ్: అనిల్ పాశాల; స్టంట్స్: దిలీప్ సుబ్రమణియన్; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం చేస్తున్నారు. డిసెంబర్‌ 6న బైకర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.