ఎన్.టి.ఆర్ సినిమా.. అతనికి ఛాన్స్..!

RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రాం కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. యువ సంగీత కెరటం అనిరుధ్ తమిళ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నాడు. అక్కడ స్టార్ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. 

తెలుగులో అజ్ఞాతవాసి, నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు అనిరుధ్. అసలైతే త్రివిక్రం డైరక్షన్ లో తారక్ నటించిన అరవింద సమేత సినిమాకు ముందు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ ఫిక్స్ అయ్యాడు కాని ఎందుకో ఆ ప్రాజెక్ట్ చేయలేదు. అనిరుధ్ ప్లేస్ లో తమన్ వచ్చాడు. సో అప్పుడు ఎన్.టి.ఆర్ మూవీ మిస్సైనా కొరటాల శివ డైరక్షన్ లో సినిమాకు ఎన్.టి.ఆర్, అనిరుధ్ కాంబో ఫిక్స్ అయ్యింది.