
నాలుగు సక్సెస్ ఫుల్ సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు త్వరలో ఐదవ సీజన్ కు రెడీ అవుతుంది. సీజన్ 4ని హోస్ట్ చేసిన నాగార్జుననే ఈ సీజన్ ను హోస్ట్ చేస్తారని తెలుస్తుంది. సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ చేయగా సీజన్ 3, 4 లను కింగ్ నాగార్జున హోస్ట్ చేశారు. ఇప్పటికే సీజన్ 5లో సెలెక్ట్ అయిన కొందరి పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా సీజన్ 5లో ఆరెక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా ఉంటుందని టాక్.
బిగ్ బాస్ సీజన్ 5లో పాయల్ కూడా ఒక కంటెస్టంట్ గా వస్తుందని తెలుస్తుంది. పాయల్ హౌజ్ లో ఉంటే గ్లామర్ కు కొదవే ఉండదు. అందుకే కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేసిన సరే బిగ్ బాస్ సీజన్ 5లో పాయల్ ను తీసుకున్నారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో జబర్దస్త్ హైపర్ ఆది, యూట్యూబ్ హీరో షణ్ముఖ్, టిక్ టాక్ దొరబాబు, యాంకర్ శివ, వర్షిణి, శేఖర్ మాస్టర్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటుగ పాయల్ కూడా హౌజ్ లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా రాబోతుందని టాక్.