సినీ కార్మీకులకు వ్యాక్సిన్ డ్రైవ్..!

కరోనా టైం లో సీసీసీ ద్వారా సినీ కార్మీకులకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు చిరంజీవి. చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ద్వారా లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ లో సినీ కార్మీకులకు నిత్యావసరాల పంపిణీ చేశారు. ఇక ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియని ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ వారి సహకారంతో సీసీసీ ద్వారా సినీ కార్ములకు, 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వారికి, మా సభ్యులకు, సినీ జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయించే ఏర్పాటు చేశారు.

ఇప్పటికే వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. రోజుకి 500 నుండి 600 మందికి వరకు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. సీసీసీ ద్వారా ఇంతకుముందే 45 ఏళ్లు పైబడిన సినీ కార్మీకులకు కరోనా వ్యాక్సిన్ వేయించగా ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన సినీ పరిశ్రమకు చెందిన వారికి వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరక్టర్ ఎన్.శంకర్ పాల్గొన్నారు.