అనీల్ రావిపుడి శర్వానంద్ కాంబో..?

పటాస్ టూ సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన F2 మూవీకి సూపర్ హిట్ సీక్వల్ గా వస్తున్న F3 సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి బాలకృష్ణతో సినిమా చేస్తాడని టాక్. అయితే బాలయ్య బాబు అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా పూర్తయ్యాక అనీల్ రావిపుడి సినిమా చేసే అవకాశం ఉంది.

ఈలోగా అనీల్ రావిపుడి యువ హీరో శర్వానంద్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. రీసెంట్ గా అనీల్ రావిపుడి శర్వానంద్ ను కలిసి స్టోరీ వినిపించాడట. అనీల్ చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శర్వానంద్ ప్రస్తుతం మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఆరెక్స్ 100 తర్వాత అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న మహా సముద్రం సినిమాలో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు.