
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైర్క్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అంచనాలు పెంచుతుండగా సినిమాపై ప్రభా ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది.
ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు ఓటిటి ఆఫర్ వచ్చినట్టు టాక్. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాకు 400 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేసిన రాధే శ్యామ్ సినిమాకు డిజిటల్ రిలీజ్ కు క్రేజీ ఆఫర్ వచ్చింది. అమేజాన్ ప్రైం చేసిన ఈ ఆఫర్ పై దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. సినిమా బడ్జెట్ కూడా అటు ఇటుగా 300 కోట్ల దాకా కాగా డిజిటల్ రైట్స్ కే 400 కోట్లు అంటే శాటిలైట్ రైట్స్ తో మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.