తమిళ దర్శకులను నమ్ముకున్న తెలుగు స్టార్ హీరో..!

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో తన పంథా మార్చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఈమధ్యనే వచ్చిన రెడ్ సినిమా కూడా హిట్ అవడంతో తనని ఆడియెన్స్ మాస్ హీరోగానే చూసేందుకు ఇష్టపడుతున్నారని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన నెక్స్ట్ సినిమాను పందెంకోడి ఫేమ్ లింగుసామితో చేస్తున్నాడు రామ్. ఈ సినిమా కూడా మాస్ అండ్ యాక్షన్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా మరో తమిళ డైరక్టర్ తో రామ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

సౌత్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన మురుగదాస్ తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వచ్చారు. తెలుగులో చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ సినిమాలు చేశారు మురుగదాస్. మరోసారి డైరెక్ట్ తెలుగు సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు మురుగదాస్. స్టార్ హీరోలతో చేయాలని అనుకున్నా అందరు బిజీ అవడంతో ఎనర్జిటిక్ స్టార్ రాం తో మురుగదాస్ సినిమా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. రామ్ కూడా ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి మురుగదాస్ తో రామ్ సినిమా దాదాపు కన్ ఫాం అని అంటున్నారు.