
RRR తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శంకర్ చేస్తున్న ఇండియన్ 2 పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మళయాళ భామ మాళవిక మోహనన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మళయాళంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మాళవిక మోహనన్ తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది.
ఈ ఇయర్ వచ్చిన విజయ్ మాస్టర్ సినిమాలో ఆమె నటించింది. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరిస్తుంది మాళవిక మోహనన్. రాం చరణ్ 15వ సినిమాకు హీరోయిన్ గా ఆమె పర్ఫెక్ట్ అని చిత్రయూనిట్ డిసైడ్ అయ్యారట. ఇక సినిమాలో విలన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూట్ పూర్తి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.