
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సినిమా కథ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. మహేష్, రాజమౌళి సినిమా కథ తనకే తెలియదని.. ఇంకా కథ ఫైనల్ కాలేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథలన్ని వాస్తవం కాదని చెప్పారు కె.ఎల్ నారాయణ.
రాజమౌళి ప్రస్తుతం RRR సినిమా చేస్తున్నారు. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి సినిమాకు ముందు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి, మహేష్ కాంబో మూవీ 2022 లో స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.