
శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం సంగీతం ఉన్నంతవరకు గుర్తుండిపోయే పేరు.. తెలుగు సినిమా పాటకి ఆయనో చిరునామా.. బాలు లేని లోటు తీర్చలేనిది. జూన్ 4 బాలు పుట్టినరోజు. ఆయన జయంతి సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఘన నివాళి అర్పించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల పాటు ఆయన పాటలతో లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎస్పీ బాలు స్వర నీరాజనం కార్యక్రమాన్ని డైలాగ్ కింగ్ సాయి కుమార్ దీపోత్సవ గీతంతో ప్రారంభించారు. ఆయన హోస్ట్ గా సాగిన ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులు బాలుకు నివాళులపిస్తూ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, కళాతపశ్వి కే విశ్వనాథ్, కే.రాఘవేద్ర రావు, కోదండ రామిరెడ్డి, రాజశేఖర్, కృష్ణ, త్రివిక్రం శ్రీనివాస్, కృష్ణం రాజు పాల్గొన్నారు.