
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కన్నడలో స్టార్ హీరోగా సత్తా చాటుతున్న ఉపేంద్ర తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన ఉపేంద్ర ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా ఉపేంద్ర విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.