కలక్షన్ కింగ్ 'సన్ ఆఫ్ ఇండియా' టీజర్..!

కలక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా డైమండ్ రత్నబాబు డైరక్షన్ లో వస్తున్న సినిమా సన్నాఫ్ ఇండియా. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. తాను ఎప్పుడు ఎక్క‌డ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక అంటూ టీజర్ లో చిరు వాయిస్ ఓవర్ హైలెట్ గా నిలిచింది. ఇక మోహన్ బాబు కూడా నేను క‌స‌క్ అంటే మీరంద‌రూ ఫ‌సక్ అంటూ చెప్పిన డైలాగ్ కూడా అదిరింది. 

సన్ ఆఫ్ ఇండియా టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ సదర్భంగా అడగ్గానే సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు మోహన్ బాబు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత కలక్షన్ కింగ్ మోహన్ బాబు తన మార్క్ సినిమాతో వస్తుందని సన్ ఆఫ్ ఇండియా టీజర్ చూస్తే అర్ధమవుతుంది. మరి సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.